October 7, 2025
image-11

వేదం అందరిదీ. వర్ణాలు పుట్టుకతో రావు. పుట్టుకతో అందరూ ఒకటే వర్ణం

ఇవాళ కొందరు నాస్తికులు పోస్ట్లు పెట్టారు.

బ్రాహ్మణుడే వేదం పఠించాలి. క్షత్రియుడే యుద్ధం చెయ్యాలి. వైశ్యుడే వ్యాపారం చెయ్యాలి. ఇవన్నీ రిజర్వేషన్స్ కావా?

ఇది వాళ్ళ ప్రచారం.

అయితే దీన్ని రివర్స్ లో చెప్తాయి హిందూ గ్రంధాలు.

వేదం పఠించే వాడిని బ్రాహ్మణుడు అని. యుద్ధం చేసేవాడిని క్షత్రియుడు అని. వ్యాపారం చేసేవాడిని వైశ్యుడు అని అంటాయి. అలాగే పుట్టుకతో ఈ మూడు వర్ణాల వారూ కూడా సూద్రులే.

జన్మనా జాయతే శూద్రః
కర్మణా జాయతే ద్విజః
వేద జ్ఞానేషు విప్రాణాం
బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణాః

Skanda Purana Vol. 18 Book VI , Nagar Kanda , Chapter 239 , Verse 31-34

శూద్రేణ హి సమస్తావత్ యావద్వేదే న జాయతే (మనుస్మృతి 2-172 )

ఉపనయన , విద్యాసంస్కారం అయ్యేవరకు ప్రతివాడూ శూద్రుడే అని మనుస్మృతి చెపుతుంది.

బ్రాహ్మణక్షత్రియవిశాం శూద్రాణాం చ పరంతప ।
కర్మాణి ప్రవిభక్తాని స్వభావప్రభవైర్గుణైః ।।
(భగవద్గీత 18:41)

బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రులు – వీరి యొక్క విధులు వారివారి లక్షణములకు అనుగుణంగా, వారి వారి గుణముల ప్రకారంగా కేటాయించబడినవి. (పుట్టుక పరంగా కాదు).

మన ప్రామాణిక గ్రంధాలపై మనకు అవగాహన రానంత వరకు ప్రతి తింగరి వెధవ, వంకర టింకర వక్రీకరణలతో మనలను మోసం చేస్తాడు. తస్మాత్ జాగ్రత్త !

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *