
వర్ణాలు శాశ్వతం కాదు అని మనుస్మృతి చెప్తోంది. ఒక వర్ణం తల్లి తండ్రులకు పుట్టిన పిల్లలు అదే వర్ణ స్వభావాలను కలిగి ఉండకపోవచ్చును కదా. అలాగే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య తల్లి తండ్రుల కర్మలకు, పనులకు వీరి అలవాట్లకు తేడా ఉండనూ వచ్చు. అప్పుడు ద్విజులైన తల్లి తండ్రుల ద్వారా రావాల్సిన వర్ణాలు రాకపోగా పుట్టుకతో వచ్చే శూద్ర వర్ణమే వారికి మిగులుతుంది.
మనుస్మృతి 10:65
शूद्रो ब्राह्मणतामेति ब्राह्मणश्चैति शूद्रताम् ।
क्षत्रियाज् जातमेवं तु विद्याद् वैश्यात् तथैव च ॥
శూద్రో బ్రాహ్మణామేతి బ్రాహ్మణశ్చైతి శూద్రతామ్ |
క్షత్రియా జ్ఞాతిమేవంతు విద్యాద్ వైశ్యాత్తథైవచ ||
శూద్రుల ఇంట పుట్టి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్ణములకు సమాన గుణ కర్మ స్వభావములు కలవాడైన వాడు బ్రాహ్మణుడో, క్షత్రియుడో, వైశ్యుడో అవుతాడు. అలాగే బ్రాహ్మణాది వర్ణాల వారి ఇంట పుట్టిన వాడు గుణ కర్మ స్వభావముల చేత చేత శూద్రులు అవుతారు.
ఈ శ్లోకం ప్రకారం ఉన్నత కుటుంబాల్లో (ద్విజుల కుటుంబాలలో) పుట్టిన వారికి భయం ఉంటుంది. వర్ణం కొల్పోయే అవకాశం ఎప్పుడూ ఉంటుంది కాబట్టి సరైన నడవడిక కోసం అందరూ ప్రయాణించేవారు. శూద్రులు కూడా తమ వర్ణాన్ని పెంచుకునే ఆసక్తి కనబరిచే వారు. అందుకే అన్ని వర్ణాల వారిలోనూ ఈ మార్పులు కనిపించేవి.
ఇతిహాస పురాణాల్లో కూడా ఒక వర్ణంలో పుట్టి మరో వర్ణానికి మారిన వారు అనేకులు మనకు కనిపిస్తారు.
వేద వ్యాసుడు, పరశురాముడు, రావణుడు, వాల్మీకి, విశ్వామిత్రుడు మొదలైన వాళ్లంతా ఒక వర్ణంలో పుట్టి మరో వర్ణానికి మారిన వారే.
కాబట్టి వర్ణాలను సరిగ్గా అర్ధం చేసుకోలేక కొందరు చేసే విమర్శకు సరైన సమాధానం చెప్పాలంటే ఈ శ్లోకాన్ని గుర్తుపెట్టుకోండి.
అనేక సనాతన ధర్మ గ్రంథాల్లో ఇదే విషయం చెప్పబడి ఉంది అని గమనించగలరు.
మరో పోస్టులో మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. స్వస్తి
మీ రమణ నేషనలిస్ట్