
మనుస్మృతి ప్రకారం సతి అనేదే లేదు.ఎలా అంటే…
భర్తను కోల్పోయిన స్త్రీని ఆమె యొక్క కుమారుడే పోషించాలి అని చెబుతోంది. తండ్రి తో పాటు తల్లి, భర్తతో పాటు భార్య కూడా సతి అయ్యి చనిపోవాలి అనే నియమమే ఉంటే ఇక పోషించే బాధ్యత ఎలా తీసుకుంటాడు కుమారుడు?
కాబట్టి సతి సహగమనం అనేది కేవలం కల్పితం.
భర్తను కోల్పోయిన తల్లిని పోషించి రక్షించడం పుత్రుని బాధ్యత
పెళ్లి చేయాల్సిన కాలంలో బిడ్డకు పెళ్లి చేయకపోతే తండ్రి నిందితుడు. భార్యను సుఖపెట్టలేకపోతే భర్త నిందితుడు. భర్త చనిపోయాక తల్లిని కాపాడకపోతే కొడుకు అపరాధి. (మనుస్మృతి 9:4)
పూర్తి శ్లోకం
कालेऽदाता पिता वाच्यो वाच्यश्चानुपयन् पतिः ।
मृते भर्तरि पुत्रस्तु वाच्यो मातुररक्षिता ॥ ४ ॥ 9:4
కాలే దాతా పితా వాచ్యో వాచ్యశ్చానునయనే పతిః
మృతే భర్తరి పుత్రస్తు వాచ్యో మాతు రక్షితా (9:4)
ప్రతిపదార్ధం:
కాలే = కన్యకు వివాహం చేయడానికి తగిన వయస్సు వచ్చినప్పుడు, అదాతా = వివాహం చేయని, పిఠా వాచ్యః = తండ్రి నిందనీయుడు, చ = మరియు, అనుపయన్ పతిః = వివాహానంతరం, ఋతుకాలానంతరం భార్యతో సంగమం చేయని పతికూడా నిందనీయుడు, భర్తరి మృతే = పతి మరణానంతరం, మాతుః+అరక్షితా పుత్రః వాచ్యః = తల్లిని భరణ పోషణాదులచేత రక్షించని పుత్రుడుకూడా నిందనీయుడే.
ఇప్పుడు చెప్పండి. సతి అనేదే లేనప్పుడు హిందూ గ్రంథాల్లో సతి ఉంది అని ప్రచారం చేస్తున్న వారి వెనుక ఉన్నది ఎవరు?