October 7, 2025
image-24

హిందూ గ్రంథాల్లో స్త్రీ రెండో పెళ్లి గురుంచి ప్రస్తావన ఎక్కడ ఉంది ?

భారతీయ స్త్రీ లేదా హిందూ స్త్రీ రెండో పెళ్లి గురుంచి మన వేదాలు, శాస్త్రాలు ఏం చెప్తున్నాయో తెలుసుకోవాలని చాల మందికి ఉంటుంది. వారికోసమే ఈ పోస్ట్.

విధవా వివాహం / భర్త నుండి విడిపోయిన స్త్రీ మారు మనువు గురుంచి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

“వేదాల్లో స్త్రీ రెండో పెళ్లి ప్రస్తావన “

హిందువులకు వేదాలు పరమ ప్రామాణిక గ్రంధాలు. కాబట్టి ముందుగా వేదాలు స్త్రీ పునర్వివాహం గురుంచి ఎం చెప్తున్నాయి చూద్దాం.

అథర్వణ వేదం (రిఫరెన్స్ -1)

या पूर्वं पतिं वित्त्वाऽथान्यं विन्दतेऽपरम् ।
पञ्चौदनं च तावजं ददातो न वि योषतः ।। (Atharva ved 9.5. 27)

యా పూర్వం పతిం విత్త్వా ऽథాన్యం విన్దతే ऽపరమ్ |

పఞ్చౌదనం చ తావజం దదాతో న వి యోషతః || (అథర్వణ వేదం 9. 5. 27)

భావం: భర్త మరణించిన తర్వాత మరొక వ్యక్తిని వివాహం చేసుకున్న స్త్రీ పంచౌదన యజ్ఞం చేయాలి. అటువంటి వారిని ఎవరూ విడదీయలేరు. కాబట్టి ఈ మంత్రం ప్రకారం స్త్రీ రెండో పెళ్లి చేసుకోవచ్చును అని తెలుస్తున్నది.

“ఆర్య సమాజం భాష్యం”

అథర్వణ వేదం (రిఫరెన్స్ -2)

समानलोको भवति पुनर्भुवापरः पतिः ।
योऽजं पञ्चौदनं दक्षिणाज्योतिषं ददाति ।। Atharva Veda(9.5.28)

సమానలోకో భవతి పునర్భువాపరః పతిః |

యో3 ऽజం పఞ్చౌదనమ్దక్షిణాజ్యోతిషం దదాతి||

భావం: స్త్రీ మరియు కొత్త భర్త తన మునుపటి భర్త స్థాయికి సమానమే అని ఈ మంత్రం చెబుతుంది.

“ఆర్య సమాజం భాష్యం”

ఋగ్వేదంలో స్త్రీ రెండో పెళ్లి ప్రస్తావన

రిఫరెన్స్ -1

ఋగ్వేదం 10. 40. 2

कुह स्विद्दोषा कुह वस्तोरश्विना कुहाभिपित्वं करतः कुहोषतुः ।
को वां शयुत्रा विधवेव देवरं मर्यं न योषा कृणुते सधस्थ आ ।। (Rigveda 10. 40. 2)

కుహ స్విద్ దోషా కుహ వస్తోర్ అశ్వినా కుహాభిపిత్వం కరతః కుహోషతుః |
కో వాం శయుత్రా విధవేవ దేవరమ్ మర్యం న యోషా కృణుతే సధస్థ ఆ || 10-040-02

భావం : ఇది ఒక వితంతువు రెండవ వ్యక్తిని ఎన్నుకోవడం గురించి మాట్లాడుతుంది.

స్మృతుల్లో స్త్రీ రెండో పెళ్లి ప్రస్తావన

పరాశర స్మృతిలో స్త్రీ రెండో పెళ్లి ప్రస్తావన

नष्टे मृते प्रव्रजिते क्लीबे च पतिते पतौ ।
पञ्चस्वापत्सु नारीणां पतिरन्यो विधीयते।। Parashara Smriti (4.30)

నష్టే మృతే ప్రవ్రజితే క్లీబే చ పతితే పతౌ
పఞచస్వాపత్సు నారీణాం పతిరన్యో విధీయతే

(పరాశర స్మృతి 4.30)

భావం :

ఈ క్రింది 5 సందర్భాల్లో ఒక స్త్రీ రెండో పెళ్లి చేసుకోవచ్చు అని మనుస్మృతి చెప్తోంది. భర్త మరణం, భర్త సన్యాసిగా మారితే, భర్త నపుంసకుడు అయితే, భర్త ధర్మం తప్పితే మరియు భర్త కొంత కాలం పాటు కనిపించకుండా పోయినా లేదా ఇంటి నుండి పారిపోయినా.

మనుస్మృతిలో స్త్రీ రెండో పెళ్లి ప్రస్తావన

प्रोषितो धर्मकार्यार्थं प्रतीक्ष्योऽष्टौ नरः समाः ।
विद्यार्थं षड्यशोऽर्थं वा कामार्थं त्रींस्तु वत्सरान् ।। (Manusmriti 9.76 )

ప్రోషితో ధర్మ కార్యార్థం
ప్రతీక్ష్యో౽ష్టౌ నరః సమాః
విద్యార్థం షడ్యశో౽ర్థం వా
కామార్థం త్రింస్తు వత్సరాన్
(మనుస్మృతి 9.76)

భావం: స్త్రీలు వేర్వేరు సమయ వ్యవధుల కోసం వేచి ఉండాలి (వివిధ ప్రయోజనాల కోసం పేర్కొన్నట్లు). ఆ తరువాత, వారు మరొక వ్యక్తిని ఎంచుకోవచ్చు. అంటే ఇల్లు విడిచిన భర్త కోసం కొన్నేళ్ల పాటు ఎదురుచూసి ఆ కాలం తర్వాత ఆమె రెండో పెళ్లి చేసువుకోవచ్చు.

…..

కాబట్టి భారతీయ శాస్త్రాల్లో స్త్రీ పునర్ వివాహ ప్రస్తావన ఉన్న మాట నిజమే అని తెలుస్తూ ఉంది. అలాగే అనేక ఇతిహాస సందర్భాల్లో స్త్రీ రెండో పెళ్లి ప్రస్తావన ఉంది. కాబట్టి స్త్రీ పునర్ వివాహం వేద విరుద్ధం కాదని నిరూపణ అవుతోంది.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *