October 7, 2025
papayoni-1024x1024

Fake video on Bhagavad-Gita countered హిందూ గ్రంథాలను వక్రీకరిస్తున్న కృపారావు అండ్ కో

మోక్షానికి అందరూ అర్హులే అని చెప్తున్న భగవద్గీత శ్లోకాన్ని వక్రీకరిస్తూ చేసిన ఫేక్ వీడియోలను ప్రచారం చేస్తున్న కృపారావుగారికి రమణ నేషనలిస్ట్ కౌంటర్

ఫేక్ వీడియో క్లెయిమ్:

కృష్ణుడు భగవద్గీతలో దళితుల్ని పాపయోనులు అన్నాడు. కాబట్టి రామానుజ భజన చేసే దళితులారా కళ్ళు తెరవండి.

ఒరిజినల్ శ్లోకం:

మోక్షానికి అందరూ అర్హులే అని చెప్తున్న భగవద్గీత శ్లోకం:

మాం హి పార్థ వ్యపాశ్రిత్య యేఽపి స్యుః పాపయోనయః ।
స్త్రియో వైశ్యాస్తథాశూద్రాః తేఽ పి యాంతి పరాం గతిమ్ ।। 9:32 ।।

తెలుగులో సంస్కృత శ్లోకం పదవిభజన

మాం — నా యందే; హి — నిజముగా; పార్థ — అర్జునా, ప్రిథ పుత్రుడా; వ్యపాశ్రిత్య — ఆశ్రయమును పొంది (శరణుజొచ్చి); యే — ఎవరైతే; అపి — అయినా సరే; స్యుః — అయినా కూడా; పాప యోనయః — నిమ్న స్థాయి జన్మ; స్త్రియః — స్త్రీలు; వైశ్యః — వైశ్యులు; తథా — మరియు; శూద్రః — కార్మికులు; తే అపి — వారు కూడా; యాంతి — వెళ్ళెదరు; పరాం — పరమ (సర్వోన్నత); గతిం — గమ్యమును.

భావార్ధం:

అర్జునా.. నా యందే నిజముగా ఆశ్రయమును పొంది/ నన్నే శరణుజొచ్చిన వారు ఎవరైనా సరే.. నిమ్న స్థాయి జన్మ పొందిన వాళ్ళైనా, స్త్రీలు అయినా, వైశ్యులు అయినా, శూద్రులు అయినా(కార్మికులు అయినా) అందరూ పరమగతిని(మోక్షాన్ని)చేరుకోగలరు/పొందెదరు.

ఆంగ్లంలో సంస్కృత పదవిభజన:

mām—in Me; hi—certainly; pārtha—Arjun, the son of Pritha; vyapāśhritya—take refuge; ye—who; api—even; syuḥ—may be; pāpa yonayaḥ—of low birth; striyaḥ—women; vaiśhyāḥ—mercantile people; tathā—and; śhūdrāḥ—manual workers; te api—even they; yānti—go; parām—the supreme; gatim—destination

ఆంగ్లంలో భావార్ధం:

Arjuna, certainly everyone who takes refuge in me, even if they are born of low birth, women, vaishyas (merchantle people), shudras (manual workers), goes to the supreme destination (moksha).

ఇందులో దళితులు అనే పదం ఎక్కడ ఉంది? దళితులు పాపయోని నుండి పుట్టారు అని ఎక్కడ ఉంది?

గత జన్మల పాపం వలన పాపపు యోని నుండి అంటే నీచ జన్మ పొందిన వారు కూడా తనను శరణు వేడితే ఈ జన్మలో మోక్షాన్ని పొందగలరు అని కృష్ణుడు చెప్తున్న శ్లోకాన్ని అర్ధం చేసుకోలేక వక్రీకరణ చేస్తున్నారు క్రైస్తవులు.

అంతేలే వారిగ్రన్ధతంలో ఉన్నట్టే అన్ని గ్రంథాల్లో ఉంటుంది అనే అపోహ వారికి ఉండటం సహజమే!

నేను పాపములో పుట్టినవాడను. పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. (కీర్తనల గ్రంథము 51:5)

Surely I was sinful at birth, sinful from the time my mother conceived me (Psalm 51:5 )

మీ గ్రంథాల్లో ఉన్న రొచ్చుని మీరు కడుక్కోకుండా మా సనాతన గ్రంథాలను ఎందుకు వక్రీకరిస్తున్నారు?

ఎందుకు అంటే మీ మతప్రచారం జరగాలంటే మా గ్రంథాలను వక్రీకరించాల్సిందే. అంతే కదా?

మరో విషయం, ఇక్కడ రామానుజుల వారి పేరు ఎందుకు వచ్చింది?

ఎందుకు అంటే ఆయన శూద్రులను కూడా ఆలయాల్లోకి రావాలని కోరుకున్నారు కాబట్టి.

ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు శూద్రులు కూడా మోక్షం పొందగలరు అని చెప్పినట్టు ఉంది. అలాగే శ్రీ కృష్ణుడు అందరివాడు అనే అర్ధం ఉంది. కాబట్టి ఈ వాక్యాన్ని తప్పుగా అనువదించి ప్రచారం చేయాలి. అప్పుడే శూద్రులను సనాతన ధర్మానికి దూరం చేయడం క్రైస్తవులకు సులువు అవుతుంది.

కానీ మీ పప్పులు ఇకపై ఉడకవు. మీ వక్రీకరణలు ఎప్పటికప్పుడు ఎండగట్టి మీ నిజ స్వరూపం జనం ముందు పెడతాము.

కృపారావు గారు ఇప్పటికైనా కళ్ళు తెరచి, మరోసారి ఇలాంటి ప్రయత్నం చేయరని భావిస్తున్నాను.

మీ రమణ నేషనలిస్ట్

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *