November 21, 2025
papayoni-1024x1024

పాపులకు మోక్షమిచ్చేది కూడా కృష్ణుడే! భగవద్గీత 9:2 లో శ్రీ కృష్ణుడు పాపులకి అభయం అందిస్తాను అని మాట ఇచ్చారు. మాం హి పార్థ వ్యపాశ్రిత్య యేఽపి స్యుః పాపయోనయః | స్త్రియో వైశ్యాస్తథాశూద్రాః తేఽ పి యాంతి పరాం గతిమ్ ।।
క్రైస్తవులు తమని తాము పాపులం అని చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటారు. దానికి వాళ్ళు చూపించే వాక్యం కీర్తనల గ్రంధం లో ఉంది.

నేను పాపములో పుట్టినవాడను. పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. (కీర్తనల గ్రంథము 51:5)

తామంతా పాపం వల్లనే పుట్టాము అనే క్రైస్తవుల భావనకి ఈ వాక్యం మూలం. అయితే పాపులు ఇకపై భయపడనక్కరలేదు.

భగవద్గీత 9:2 లో శ్రీ కృష్ణుడు పాపులకి అభయం అందిస్తాను అని మాట ఇచ్చారు.

మాం హి పార్థ వ్యపాశ్రిత్య యేఽపి స్యుః పాపయోనయః ।

స్త్రియో వైశ్యాస్తథాశూద్రాః తేఽ పి యాంతి పరాం గతిమ్ ।।

వారి జన్మ, జాతి, కులము ఏదైనా, లింగభేదం లేకుండా, సమాజము అసహ్యించుకునేవారయినా ( పాపపు యోని ద్వారా పుట్టునవారైనా ), నన్నుశరణు పొందిన వారంతా పరమ పదమును పొందుతారు.(భగవద్గీత 9:2)

అద్భుతం కదా!

ఇక్కడ పాప యోనః అన్న పదాన్ని మర్చిపోవద్దు

ఎంతటి నీచ, నికృష్ట, ముదనష్టపు పాపి అయినా సరే మా కృష్ణయ్య నమ్ముకుంటే మోక్షం లభిస్తుంది.

ఇక ఆలస్యం చెయ్యకుండా మతం మారిన పాపులు వెనక్కి రావాలి.

వ్యభిచారులకి పుట్టినా, పాపపు యోనికి పుట్టినా నో ప్రాబ్లెమ్. ఆల్ సిన్స్.. వన్ సొల్యూషన్… శ్రీ కృష్ణ

జై శ్రీకృష్ణ 🙏

భగవద్గీత 9:2 లో ఏముందో చూడండి.

మాం హి పార్థ వ్యపాశ్రిత్య యేఽపి స్యుః పాపయోనయః ।

స్త్రియో వైశ్యాస్తథాశూద్రాః తేఽ పి యాంతి పరాం గతిమ్ ।।

మాం — నా యందే; హి — నిజముగా; పార్థ — అర్జునా, ప్రిథ పుత్రుడా; వ్యపాశ్రిత్య — ఆశ్రయమును పొంది (శరణుజొచ్చి); యే — ఎవరైతే; అపి — అయినా సరే; స్యుః — అయినా కూడా; పాప యోనయః — నిమ్న స్థాయి జన్మ( పాపపు గర్భంలో జన్మించిన పాపులు ); స్త్రియః — స్త్రీలు; వైశ్యః — వైశ్యులు; తథా — మరియు; శూద్రః — కార్మికులు; తే అపి — వారు కూడా; యాంతి — వెళ్ళెదరు; పరాం — పరమ (సర్వోన్నత); గతిం — గమ్యమును.

ధార్మిక కుటుంబాలలో జన్మించే అదృష్టం ఉన్న జీవులు (జీవాత్మలు), చిన్నతనం నుండే మంచి విలువలు మరియు ధార్మిక జీవనము యొక్క శిక్షణ పొందుతారు. ఇది వారి పూర్వ జన్మల పుణ్య ఫలం. అదే సమయలో, మరి కొందరు జీవులు – తాగుబోతులు, నేరగాళ్ళు, వ్యసనపరులు మరియు నాస్తికులు కుంటుంబాలలో పుట్టే దురదృష్టం ఉంటుంది. ఇది కూడా, తమ తమ పూర్వ జన్మలలో ఉన్న పాప ఫలితమే.

వాటి వాటి జన్మ, లింగ, లేదా జాతి భేదము లేకుండా ఎవరైనా భగవంతుడిని సంపూర్ణముగా ఆశ్రయిస్తే, వారు సర్వోత్కృష్ట లక్ష్యమును పొందుతారు. అందరికీ అందుబాటులో ఉండే భక్తి మార్గము యొక్క గొప్పదనం దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ, ఇతర మార్గాల్లో అర్హత కొరకు చాలా కఠిన నియమాలు ఉంటాయి.

జ్ఞాన యోగము అర్హత కొరకు, జగద్గురు శంకరాచార్య ఈ విధంగా పేర్కొన్నాడు:

వివేకినో విరక్తస్య శమాదిగుణ శాలినః

ముముక్షోరైవ హి బ్రహ్మ జిజ్ఞాసా యోగ్యతా మతా

“వివేకము, విరక్తి, నియంత్రించబడిన మనో-ఇంద్రియములు మరియు మోక్షము కొరకు తీవ్ర వాంఛ – ఈ నాలుగు లక్షణాలు కలవారు మాత్రమే – జ్ఞాన యోగ మార్గాన్ని అవలంబించటానికి అర్హులు.”

కర్మ కాండ (వైదిక క్రతువులు) మార్గములో, ఆరు నిబంధనలు పాటించాలి.

దేశే కాల ఉపాయేన ద్రవ్యం శ్రద్దా సమన్వితమ్‌

పాత్రే ప్రదీయతే యత్తత్ సకలం ధర్మ లక్షణమ్‌

“కర్మ కాండలు సాఫల్యం చెందటానికి ఆరు నిబంధనలు పూర్తి అవ్వాలి – సరియైన స్థానము, సరియైన సమయము, సరైన పద్దతి మరియు దోషరహిత మంత్ర ఉచ్చారణ, ఉపయోగించే ద్రవ్యము యొక్క శుద్ధి, యజ్ఞము చేపించే అర్హత కలిగిన బ్రాహ్మణుడు, మరియు ఆ క్రతువు మీద పూర్ణ విశ్వాసము – ఇవన్నీ ఉండాలి.”

అష్టాంగ యోగ మార్గములో కూడా, కఠినమైన నియమాలు ఉన్నాయి:

శుచౌ దేశే ప్రతిష్ఠాప్య (భాగవతం 3.28.😎

“సరియైన ఆసనంలో నిశ్చలంగా కూర్చుని, హఠ యోగమును ఒక పవిత్రమైన ప్రదేశంలో చేయండి.”

వీటన్నిటితో పోలిస్తే, భక్తి యోగము ఎంత సులువంటే, ఎవరి చేత అయినా, ఏ సమయంలో అయినా, ఏ ప్రదేశంలో అయినా, ఏ పరిస్థితిలో అయినా, ఏ పదార్ధముతో అయినా అది చెయ్యబడవచ్చు.

న దేశ నియమస్తాస్మిన్ న కాల నియమస్థథా (పద్మ పురాణం)

ఈ శ్లోకం ఏం చెప్తున్నదంటే, భగవంతుడికి మనము భక్తితో ఆరాధించే సమయము, ప్రదేశము తో సంబంధము లేదు. ఆయన కేవలం మన హృదయం లోని ప్రేమనే చూస్తాడు. అన్ని ఆత్మలు (జీవులు) భగవంతుని బిడ్డలే. ప్రేమతో తన దగ్గరికి వస్తే అందరినీ తన చేతులు చాచి స్వీకరించటానికి ఆయన సుముఖంగా ఉన్నాడు.

Continue Reading

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *