త్రీణి వర్షాణ్యుదీక్షేత్ కుమారయర్తుమతీ సతీ ।
ఊర్ధ్వం తు కాలాదేతస్మాద్ విన్దేత్ సదృశం పతిమ్ ॥ 9:9౦ ॥
యుక్తవయస్సు వచ్చిన తరువాత, కన్య మూడు సంవత్సరాలు వేచి ఉండవచ్చు; ఆ సమయం తరువాత, ఆమె తగిన భర్తను పొందుతుంది.(9:90)
గమనిక: సాధారణంగా అమ్మాయిలు 13 నుండి 15 సం. వయస్సులో పెద్ద మనిషి అవుతారు. ఆ తర్వాత 3 ఏళ్లు అనగా 16 నుండి 18 సం. వయస్సు తర్వాత అమ్మాయికి పెళ్లి చేయాలి.