
మీరు విన్నది నిజమే!
పరాశర స్మృతి ప్రకారం శూద్రుల దగ్గర బ్రహ్మణులు వేదం నేర్చుకోకూడదు.
శూద్రుని అన్నాన్ని తినువాడు, శూద్రునితో కలసి కూర్చొనువాడు, శూద్రుని వల్ల వేదాంతజ్ఞానమును పొందువాడు, ఐన బ్రాహ్మణుడు మిక్కిలి పరిశుద్ధంగా ఉన్నా అతడు పతితుడగును. అట్లే శూద్రస్త్రీ వండిన అన్నాన్ని తినువాడు, శూద్ర స్త్రీని వివాహం చేసికొన్నవాడు ఐన బ్రాహ్మణుని పితృదేవతలు వదలి వేయుదురు కావున అతడు రౌరవ నరకానికి పోవును. అట్లే సూతకాన్నాన్ని తిని జీవించువాడు, శూద్రాన్నాన్ని తినువాడైన బ్రాహ్మణుడు ఏయే జన్మలు పొందునో నాకు కూడా తెలియదని పరాశర మహర్షి పలికెను. (పరాశర స్మృతి ద్వాదశాధ్యాయము)
అంటే బ్రాహ్మణులకు వేదం నేర్పే అంత పాండిత్యం ఆ కాలంలో శూద్రులకు కూడా ఉండేది అన్నమాట!
కొందరి వాదన ప్రకారం శూద్రులకు అసలు విద్య అనేదే లభించలేదు.
మరి పై శ్లోకం ప్రకారం విద్యాభ్యాసానికి నోచుకోని శూద్రుడు కూడా బ్రహ్మణుడుకి వేదం చెప్పగలడు అంటే… శూద్రులకు చదువు నిషేధం అంటూ కుహనా మేధావులు ఇంతకాలం చేస్తున్న ప్రచారం అంతా అబద్దమే కదా!
ఇలాంటిదే మరో వాక్యం ఉంటుది.
శూద్రులు పాలించే రాజ్యంలో బ్రాహ్మణుడు జీవించరాదు
#శ్లో॥ శూద్రరాజ్యే నివ సేన్నా ధార్మికజనావృతే
న పాషండిగణాక్రాంతే నోప సృష్టేoత్య జైర్నవృభి:॥
#తాత్పర్యం॥ శూద్రుడు రాజ్యం చేసే చోట ఉండరాదు. ధర్మపరులైన వారు ఒకరిద్దరే గల గ్రామంలో నివశించరాదు. వేదబాహ్యులు, పాషండులు, చండాలురు, కపటవేషధారులు అధికంగా ఉండే గ్రామంలో నివాసం పనికిరాదు.(మను స్మృతి లో ఉన్నది ఉన్నట్లు వ్రాసాను)
పై శ్లోకం ప్రకారం శూద్రులు కూడా పాలన సాగించినట్టు , రాజ్యాలు కూడా ఏలతారు అని అర్ధం రావడం లేదా?
అంటే మనదేశంలో చదువుకి, రాజ్యాధికారానికి శూద్రులు దూరంగా లేరు అని పై శ్లోకాల ప్రాకారం మీకు అర్ధం కావడం లేదా?