
దేనికి పాప పరిహారం కట్టాలి?
వ్యవసాయం చేసే రైతు/వ్యవసాయ దారుడు తన జీవనం కోసం పొలాన్ని దున్నే క్రమంలో, అనేక చెట్లను, క్రిమి కీటకాలను చంపుతాడు. కాబట్టి అతడు పాప పారిహార్ధం అనాధలకు,బ్రాహ్మణులకు దానం ఇవ్వడం ద్వారా పాప పరిహారం చేసుకోవాలని పరాశర స్మృతిలో ఉంది. సదరు పాస్టర్ గారు ఈ విషయాన్ని చూపిస్తూ ఇదంతా బ్రాహ్మణుల కోసం రాసుకున్న విషయాలు అని, ఇదంతా దోపిడీ అన్నట్టు రాసుకొచ్చారు. అనాధలకు కూడా దానం ఎందుకు చేయ్యమన్నారో సదరు పాస్టర్ గారు చెప్పాలి.
బ్రాహ్మణులు ఇక్కడ అనాధల కోసం రాయడం ఆయన వదిలిపెట్టారు అంటే ఆయన టార్గెట్ బ్రాహ్మణులు మాత్రమే కాబట్టి. జీవ హింస చేసిన వాడు తోటి మానవులలో జ్ఞానులు, దేవుని సేవకులు, గురువులు అయిన బ్రాహ్మణులకు, దేవుని స్వరూపాలైన అనాధ పిల్లలకు ఇంత దానం ఇవ్వడం వలన పుణ్యం వస్తుంది అనడం నాకు ఏమాత్రం తప్పు అనిపించడం లేదు.
ఒక వేళ దేవుని సేవకులైన బ్రాహ్మణులకు దానం ఇవ్వడం తప్పు అయితే ఇదే పని చేస్తున్నాం అని చెప్పుకునే ఎవరికి దానం ఇచ్చిన తప్పే అని ఒప్పుకోవాల్సి వస్తుంది.
ఇప్పుడు బైబిల్లో ఉన్న దోపిడీ గురించి చూద్దాం. పరాశర స్మృతిలో జీవ హింస పాపం అని ఉంటే బైబిలలో రుతుక్రమం, పిల్లలను కనడం లాంటి జీవక్రియలు పాపం అని రాశారు. పాపపరిహారం కోసం గొర్రెల్ని పావురాలను, గువ్వలను బలి ఇమ్మన్నారు.
పెద్దమనిషి అవడం పాపం. దానికి పరిహారం జతుబలి (జీవ హింస). యజకుడికి ఆ జంతు మాంసం లభిస్తుంది.
ఎనిమిదవ నాడు ఆమె రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకునియొద్దకు తేవలెను. యాజకుడు ఒకదానిని పాపపరిహారార్థబలిగాను ఒకదానిని దహనబలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు ఆమె స్రావవిషయమై యెహోవా సన్నిధిని ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. (లేవీయకాండము 15:29-30)
పిల్లల్ని కనడం పాపం. దానికి పరిహారం జంతు బలి. జంతు మాంసం యాజకుడికి దక్కుతుంది.
కుమారునికొరకేగాని కుమార్తెకొరకేగాని ఆమె శుద్ధిదిన ములు సంపూర్తియైన తరువాత ఆమె దహనబలిగా ఒక యేడాది గొఱ్ఱపిల్లను, పాపపరిహారార్థబలిగా ఒక పావు రపు పిల్లనైనను తెల్ల గువ్వనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకునియొద్దకు తీసికొనిరావలెను. (లేవీయకాండము 12:6)
జీవక్రియలను బూచిగా చూపించి జంతు బలి ఇవ్వాలనే యెహోవా దేవుడి ధర్మశాస్త్రం గొప్పదా? జీవ హింసకు పరిహారంగా దానం ఇమ్మనే పరాశర స్మృతి గొప్పదా? మీరే ఆలోచన చెయ్యండి
పాస్టర్ గారి పోస్ట్ ఇక్కడ చూడండి.
https://www.facebook.com/photo?fbid=818051500361991&set=a.414658500701295
ఇదే పోస్ట్ పై మరో కౌంటర్ ఉంది. మళ్ళీ కలుద్దాం