
శ్రీ రాముడు నేర్పిన దేశభక్తి
“జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ”
అంటే అర్థం తెలుసా?
రావణ సంహారము తర్వాత
లక్ష్మణుడు, విభీషణడు మొదలైన వారితో లంకలోకి ప్రవేశించిన సమయంలో…
లక్ష్మణుడు లంకలోని ఐశ్వర్యము, బంగారు, వజ్రాల భవంతులను శ్రీరామునికి చూపించి,
‘ఆహా అయోధ్య కన్నా ఐశ్వర్యవంతమైనది…ఇక్కడే ఉండిపోవచ్చు గదా…’ అని శ్రీరామునితో అంటాడు.
అప్పుడు శ్రీరాముడు మృదుమధురంగా,
“జననీ, జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ” అని పలికాడు.
అంటే మనకు జన్మనిచ్చిన తల్లీ, మనం జన్మించిన ప్రదేశము స్వర్గముకన్నా పరమోత్తమమయినవి అని అర్థం