
తప్పు ఒప్పుకున్న రంగనాయకమ్మ
రామాయణ విష వృక్షం రచయిత్రి రంగనాయకమ్మ లేటెస్ట్ ఎడిషన్ ముందు మాట లో ఇలా రాసుకొచ్చారు
‘”రామాయణ విషవృక్షం’ ఇప్పటి వరకూ 3 భాగాలుగా (3 వేరు వేరు పుస్తకాలుగా) ఉంది. కానీ ఇప్పటి నించీ ఆ 3 భాగాలూ ఒకే సంపుటంగా (ఒకే పుస్తకంగా) కలిసిపోతున్నాయి.
‘విషవృక్షం’లో మొదటి భాగాన్ని 1974లోనూ, 2వ భాగాన్ని 1975లోనూ, 3వ భాగాన్ని 1976లోనూ రాశాను. ఆ నాటి నించీ ఇప్పటి వరకూ మొదటి భాగం 7 ముద్రణలూ, 2వ భాగం 6 ముద్రణలూ, 3వ భాగం 4 ముద్రణలూ వచ్చాయి. ఇప్పుడు ఇది, అన్ని భాగాలూ కలిసిపోయిన సంపుటానికి మొదటి ముద్రణ.
ఈ భాగాలు వేరు వేరుగా ఉన్నప్పుడు, వాటికి వేరు వేరు పీఠికలు రాశాను. అంతే కాదు, ఒక భాగానికి రీప్రింటు జరిగినప్పుడల్లా అందులో ఒకటో రెండో సవరణలు చేస్తూ, కొత్త ముందు మాటలు రాస్తూ వచ్చాను.
ఇప్పుడు, అన్ని భాగాలూ కలిసిపోయిన ఈ సంపుటం కోసం, కొన్ని మార్పులు చేశాను. వాటిని పాఠకులకు చెప్పాలి.
1. వాల్మీకి రామాయణానికి గతంలో చదివిన అనువాదాల్ని ఇప్పుడు మళ్ళీ చూశాను. ఎక్కడ ఏ సందేహం కలిగినా, అనువాదాల్నీ, వాటికి మూలం అయిన శ్లోకాల్నీ, మళ్ళీ మళ్ళీ చూసి స్పష్టం చేసుకున్నాను. కొన్ని సందర్భాల్లో, అనువాదకులు చేసిన పొరపాటు వ్యాఖ్యానాల్ని గతంలో నేను యధాతధంగా తీసుకున్నట్టు గమనించి అలాంటి పొరపాట్లు సవరించాను.
2. అనువాదాలతో సంబంధం లేకుండా #నాపొరపాట్లు కూడా కొన్ని #జరిగాయి. ఉదా: తాటకిని గురించి చెప్పిన చోట, తాటకి ‘విల్లు’ పట్టుకున్నట్టు గతంలో రాశాను. కానీ, #వాల్మీకి #మూలంలో, తాటకి, విల్లు ఉపయోగించదు. అలాగే, శూర్పణఖ, రాముడితో మాట్లాడుతూ, ‘సీతా స్వయంవరానికి మా అన్న కూడా వెళ్ళాడు’ అని చెప్పినట్టు గతంలో రాశాను. కానీ, వాల్మీకి మూలంలో #అది #లేదు. ఇలా, కొన్ని సందర్భాల్లో మూలాన్ని మళ్ళీ చూసి అలాంటి #పొరపాట్లన్నీ #తీసేశాను.
ల. గీతంలో, మందం’ పాత్రని ఇవ్వలేదు. ఇప్పుడు ఆ పాత్రని కూడా చర్చాను.
4. ‘పీఠిక’లో అక్కడక్కడా తగ్గింపులూ, అక్కడక్కడా హెచ్చింపులూ, రెండూ చేశాను. ముఖ్యంగా, శ్రమ దోపిడీలో ‘అదనపు విలువ’ని వివరించే భాగాల్ని ఇప్పుడు తీసేశాను. ఎందుకంటే, ఇప్పుడు ఆ విషయాలు ‘కాపిటల్ పరిచయం’ ద్వారా తెలుసుకోవడానికి వీలుంది. గతంలో, ఈ పీఠిక రాసే నాటికి, ఆ పుస్తకం లేదు. ‘రామాయణ’ కధా కాలం కన్నా ఎన్నో వేల సంవత్సరాల కిందటే ప్రారంభమైపోయిన బానిసత్వం, శ్రమ దోపిడీ, ధనిక పేద తేడాలూ – వంటి విషయాల గురించి చెప్పకుండా రామాయణ సంస్కృతిని విమర్శిస్తే, అది అర్ధం కాదు. కాబట్టి, అప్పుడు ఆ నాటికి నాకు చేతనైన పద్ధతిలో పీఠికలోనే ఆ విషయాలు
అంటే రామాయణ మూల గ్రంథాన్ని చదవకుండానే ఇన్నేళ్లు విషం చిమ్మింది ఈ రంగనాయకి!
ఇప్పుడు ఏమి చెయ్యాలి?
(మరో భాగంలో మరిన్ని వివరాలు చూద్దాం)