
వైశ్య తండ్రికి శూద్ర స్త్రీకి పుట్టినవాడిని దశరథుడు చంపేశాడు. దానికి శిక్ష అనుభవించాడు అని రామాయణం చెబుతోంది. అంటే నాటి కాలంలో అన్ని వర్గాల వారికి భక్తి ఉండేది. వారి మాటకు బలము ఉండేది.
పైగా ఒక వైశ్యుడు ఆతని శూద్ర భార్య అడవిలో తపస్సు చేస్తూ ఉంటే దశరథుడు ఎందుకు తల నరకలేదు? వారి పుత్రుడిని పొరపాటున చంపినప్పటికీ ఈ శూద్రులకి క్షత్రియుడైన దశరథుడు ఎందుకు సారీ చెప్పాడు? అతి ముఖ్యమైన ఈ విషయాలను రచయిత్రి ఎందుకు పక్కన పెట్టింది?
రాజ్యాన్ని పాలించే రాజు తన పొరపాటును ప్రజల ముందు ఒప్పుకోవడం ఏమిటి? ఆ రాజు ఎంత గొప్ప సంస్కార వంతుడు?
ఇవేవీ మన రంగనాయకి కి అవసరం లేదా?